Janani

Varun Grover, M. M. Keeravaani

జననీ
ప్రియ భారత జననీ
జననీ

నీ పాదధూళి తిలకంతో
ఫాలం ప్రకాశమవనీ
నీ నిష్కళంక చరితం
నా సుప్రభాతమవనీ
జననీ

ఆ నీలి నీలి గగనం
శత విస్ఫులింగ మయమై
ఆహవ మృదంగధ్వనులే
అరినాశ గర్జనములై
ఆ నిస్వనాలు నా సేద తీర్చు
నీ లాలి జోలలవనీ

జననీ

Altri artisti di Pop rock